కూటమి ప్రభుత్వానికి స్త్రీశక్తే బలమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.మహిళాభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.గాజువాక క్లబ్ ఆడిటోరియంలో స్త్రీ శక్తి,సూపర్ సిక్స్ పథకాలపై మహిళా సదస్సు నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి చేసింది సూన్యమని అన్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలులో మహిళలకు అధిక ప్రాధాన్య ఇస్తున్నట్లు తెలిపారు.ఇచ్చిన మాటను తూచా అమలు చేయడంలో ప్రభుత్వం ముందుంటుందని అన్నారు