భీమవరంలో కలెక్టరేట్ నిర్మించడానికి స్థలాలు ఉన్నాయని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణంపై గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. భీమవరం మార్కెట్ యార్డులో 20 ఎకరాలు, తాలూకా ఆఫీసు వద్ద 6 ఎకరాల స్థలం ఉందన్నారు. అసలు పట్టణంలో స్థలం లేదని రఘురామకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రఘురామ, రామాంజనేయులు ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.