నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో గురువారం రాత్రి గణపతి నిమజ్జనం వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారి కొండచిలువ రోడ్డుపైకి రావడంతో యువకులు అరుపులు కేకలతో పరుగులు తీశారు. వెంటనే జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి చాకచక్యంతో కొండచిలువను పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. అనంతరం గణపతి నిమజ్జనం నిర్వహించి బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు.