శనివారం సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణాంధ్ర స్వచ్ఛభారత్ లో భాగంగా ఏలూరు కలెక్టరేట్లో ఉద్యోగులు శ్రమదానం చేపట్టారు.. పలువు పారపట్టి ఉద్యోగులు కలెక్టరేట్ పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తాచెదారంతో నిండిపోయిన కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లోని చెత్తను తొలగించి క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దినట్లు తెలిపారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపులో భాగంగా కలెక్టరేట్లో శ్రమదానం చేపట్టామని మన చుట్టూ పరిసరాలు బాగుంటే మనము బాగుంటామని అన్నారు..