వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మహావీర్ హాస్పిటల్ వెనకాల ఓ పొలంలో మేకల షెడ్డు నిర్మించి అందులో 20 మేకలను పోషిస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత వీధి కుక్కలు 20 మేకలపై దాడి చేయడంతో అందులో సుమారు 12 మేకలు మృతిచెందాయని మేకల యజమాని లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు లక్ష యాభై వేల రూపాయల నష్టం వాటిలిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.