గూడూరు మండలంలోని కే నాగలాపురం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టర్ రంజిత్ భాష ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసరాల శుభ్రత ఆవశ్యకతపై వివరించారు. ప్రతిజ్ఞ చేయించారు. అలాగే పారిశుద్ధ కార్మికులను కలెక్టర్ సన్మానించారు. ఇంకా సుంకులా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగన్వాడి కేంద్రం, గృహ నిర్మాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, జెడ్పి సీఈఓ నాసర రెడ్డి, సర్పంచ్ నయోమి, తహసిల్దారు వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.