అనంతపురం నగరంలోని రంగస్వామి నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి అదృశ్యం అయినట్లు త్రీ టౌన్ పోలీసులు వెల్లడించారు. గురువారం సాయంత్రం 7:00 సమయంలో నోటుబుక్కు కొనుక్కొని వస్తానని ఇంటి నుంచి వెళ్లినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారు గురువారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.