ఆర్మూర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ గుండ్ల చెరువు వద్ద వినాయక నిమజ్జన కోసం చేపడుతున్న ఏర్పాట్లను గురువారం సాయంత్రం 4:40 జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువు వద్దకు వెళ్లే దారిలో అక్కడక్కడా రోడ్డు చెడిపోయి ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయించాలని భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచాలని తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గజ ఈతగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.