ప్రధాని మోదీ ఈ నెల 16న కర్నూలు పర్యటన నేపథ్యంలో అడిషనల్ డీజీ మధుసూధన్ రెడ్డి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి ఆయన నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరిగింది. బుధవారం ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న ఏరోవన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో డ్రోన్ కెమెరాలు, గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి స్థాయి పోలీసు అధికారులు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.