ఇటీవల వన్యప్రాణులను వేటాడి హతమార్చిన కేసులో తాజాగా మారో ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. నాలుగు నెమళ్లు, ఒక జింకను వేటాడి హతమార్చిన కేసులో మహారాష్ట్ర కు చెందిన ఇద్దరు, ఉమ్మడి జైనథ్ మండలానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అయితే నిలేశ్, రోషన్ లను ఇప్పటికే అరెస్టు చేయగా పరారీలో ఉన్న భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన రాథోడ్ సందీప్, మహారాష్ట్రకు చెందిన రాథోడ్ యోగేష్ లను తాజాగా శుక్రవారం అరెస్టు చేసిన ఆదిలాబాద్ FDO చిన్న విశ్వనాథ్ భూషరెడ్డి శుక్రవారం తెలిపారు.. వీరి వద్ద నుంచి ఒక కత్తి, నాటు తుపాకీ స్వాదీనం చేసుకున్నమన్నారు.