యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఎంపీడీవో జలంధర్ రెడ్డి గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులు ఇంకా ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆయన ఆదేశించారు. నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉంటే కార్యాలయ సిబ్బందిని సంప్రదించి పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలు పెట్టడం వారు వెంటనే మొదలుపెట్టి ఇంటిని నిర్మాణం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాగరాజు స్పెషల్ ఆఫీసర్ సందీప్ రెడ్డి గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.