పెదకళ్లెపల్లి లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలలోపే పేదలకు అన్యాయం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు ఆరోపించారు. మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలో పింఛన్ కోల్పోయిన దివ్యాంగులు తాడేపల్లి లక్ష్మణరావు, కేతరాజు నాగమల్లేశ్వరమ్మలను ఆయన పరామర్శించారు. వలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారని రమేష్బాబు విమర్శించారు.