సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భీమవరం హెడ్ పోస్ట్ మాస్టర్ పి రాజు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో బుధవారం సాయంకాలం 5 గంటలకు భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో సైబర్ నేరాలపై అవగాహన, ప్లకార్డ్ ప్రదర్శన నిర్వహించారు. రాజు మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సైబర్ నేరాల పట్ల అవగాహన ఉంటే తప్ప వాటి నుంచి తప్పించు కోలేరన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తామని, లోన్ ఇప్పిస్తామని ఫోన్ చేసి సంప్రదిస్తే వాటిని నమ్మవద్దని సూచించారు.