ఎరువులు కొరతపై మండల సర్వసభ్య సమావేశంలో అధికారులను సభ్యులు నిలదీశారు. బుధవారం సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మెరుగు రాజేశ్వరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రైతుకు 25 కేజీలు మాత్రమే అనే నిబంధనతో రైతులు సతమతమవుతున్నారన నాగభూషణరావు, అశోక్ చక్రవర్తి, చిన్నారావు, మన్మధరావు ఎంపీడీవోను ప్రశ్నించారు. కలెక్టర్, వ్యవసాయ మంత్రి యూరియా కొరత లేదన్నారని గుర్తు చేశారు.