ప్రజల పక్షాన పోరాటాలకు స్ఫూర్తివంతమైన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి పై శనివారం రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో నాయకులు నివాళులు అర్పించారు. కమ్యూనిస్టు దిగ్గజం, సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన పోరాటాలు మరువలేమని, ఆయన ఆశయ సాధనకు ప్రతిన భూనుతామని ఈ సందర్భంగా తాటిపాక మధు తెలిపారు.