వాల్మీకిపురం పట్టణంలోని శివాలయంలో అఖండ దీపారాధనకు దీపాంతులను బుధవారం సాయంత్రం బహుకరించారు. వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని కోనేటి వీధిలో వెలసిన శివాలయంలో అర్చకులు శీన స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అఖండ దీపారాధన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృత, రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వాల్మీకిపురంకు చెందిన ఫణి కుమార్ దంపతులు ఆలయానికి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అఖండ దీపము వెలిగించుటకు దీపాంతులు బహుకరించారు.