గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రౌడీలా వ్యవహరిస్తున్నారని జిల్లా వ్యవసాయ సంఘం నాయకులు మల్లికార్జున తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం నగరంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి గుమ్మనూరు జయరాం వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. సోలార్ ప్లాంట్ కోసం వ్యవసాయ భూములను కట్టబెడుతున్న ప్రభుత్వం భూములను పరిశీలించేందుకు వెళ్లిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులను తిట్టిన గుమ్మనూరు జయరాం పై చర్యలు తీసుకోవాలని కోరారు.