పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక మండపాల అనుమతుల కోసం ఈ సంవత్సరం సుమారు 360 ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించబడ్డాయి. పెందుర్తి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.వి. సతీష్ కుమార్ సంబంధిత అన్ని అప్లికేషన్లపై తక్షణ చర్యలు చేపట్టి, తన సిబ్బందిని ప్రతి మండపం వద్దకు పంపించి సమగ్ర పరిశీలనలు జరిపేలా చేసి, NOC జారీ ప్రక్రియను వేగవంతం చేయుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పోలీసుల ఈ సత్వర చర్యల వలన, మండప నిర్వాహకులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసుకునే అవకాశం కలిగింది.ఈ సందర్భంగా,మండప నిర్వాహకులు పోలీసులను అభినందించారు