ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం వాసవి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించారు వినాయక సమితి పర్వదినం సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారుఈ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని 8 అడుగుల ఎత్తైన మట్టి బాలగణపతికి 11 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణీయంగా పూణే వాయిద్యాలతో కోలాటం నృత్యాలతో శోభాయాత్ర చేపట్టారు శోభాయాత్రలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాలోత్ రాందాసు నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.