సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ పరితోష్ పంకజ్ వినతి పత్రాలను స్వీకరించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎస్పీ వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఆదేశించారు. మొత్తం 13 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.