కెరమెరి మండల పరిధిలోని కొఠారి గ్రామపంచాయతీలోని అంబరావుగూడకు చెందిన నైనీ చిన్నరాజం వ్యవసాయ పొలంలో ఒక గంజాయి మొక్క లభించిందని కెరమెరి ఎస్ఐ మధుకర్ తెలిపారు. శనివారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా గంజాయి మొక్క లభించిందన్నారు. గంజాయి మొక్క పెంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు. గ్రామంలో ఎవరైనా గంజాయి మొక్కలు పెంచిన,అమ్మిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు