ఆమదాలవలస వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ తన పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా, అందజేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు.వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చం నాయుడు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ రైతులను ఆదుకోవడంలో శ్రద్ధ కనపరచడం పోవడంతో ఎరువులు కోసం వ్యవసాయ రైతులు రోడ్డున పడ్డారు అని ఆయన అన్నారు.రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనప్పటికీ పూర్తిస్థాయిలో రైతులకు యూరియా ఆదుకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారని అని ఆయన తెలిపారు.