గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను అన్ని విధాలుగా అవమానించాడని బ్రాందీ షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలాపెట్టాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు.