ఈనెల 1వ తేదీన కర్నూలు నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ ఇజహార్ అహ్మద్ అనే వ్యక్తి హత్య కేసులో పరార్ లో ఉన్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కర్నూలు వన్ టౌన్ సిఐ పార్థసారథి తెలిపారు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలోని షేక్ ఇజహార్ అహ్మద్ అనే వ్యక్తిని ఐదుగురు కలిసి హత్య చేశారు. ఈ హత్య కేసులో నిన్నటి రోజు ముగ్గురిని అరెస్టు చేయగా మిగిలిన ఇద్దరిని ఈరోజు మంగళవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.