జగ్గంపేట వైసీపీ విద్యార్థి సంఘ విభాగం జగ్గంపేట లో ఉన్న హాస్టళ్లు,గురుకుల పాఠశాల సమస్యలపై శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. నాలుగు రోజులు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి ఉడికి ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో కూరలు వండుతున్నట్లు తెలుసుకున్నారు. అలాగే పారిశుధ్యం క్షీణించందని, కాస్మోటిక్స్ ఛార్జీలు ఇవ్వలేదనే సమస్యలను తెలుసుకుని కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు.