ఎరుకుల కులస్తులు రాజకీయపరంగా అణిచివేతకు గురవుతున్నారని ఎరుకుల కులస్తులు ఐక్యంగా తమ హక్కులను నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని జిల్లా ఎరుకుల కుల సామాజిక వర్గ సంఘం అధ్యక్షుడు మానిపాటి రామకృష్ణ, తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం ఉదయం 11గంటలకు జిల్లా ఎరుకుల కుల సామాజిక సంఘం ఆధ్వర్యంలో ఎరుకుల కుల ఆత్మగౌరవ సభ జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు మానుపాటి రామకృష్ణ హాజరయ్యారు. ముందుగా ఎరుకుల కులస్తుల సమస్యలపై సమావేశంలో మాట్లాడారు.