కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం తిర్యాణి మండల కేంద్రంలోని PACS కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 'రేవంత్ రెడ్డి డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. యూరియా కొరతతో వారం రోజుల నుంచి రైతులు కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారన్నారు. అధికారులు వేగవంతంగా రైతులకు యూరియా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.