కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఏల్పుగొండ గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు.. సొసైటీ కి 200 యూరియా బస్తాలు వస్తాయ్ ఎనిమిది గ్రామాలకు చెందిన సుమారు 400 మంది రైతులు క్యూ లైన్ కట్టారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తా మాత్రమే యూరియాను సొసైటీ సిబ్బంది అందజేసింది పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. రైతులకు సరిపడా యూరియాని పంపిణీ చేయాలని రైతుల ప్రభుత్వం కోరారు.