నల్లగొండ జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ శనివారం అన్నారు. నార్కట్పల్లి మండలంలోని మిషన్ త్రిబుల్ ఆర్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు నియమాలు పాటించాలని తరచు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టూ వీలర్ వాహనాదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని తెలిపారు.