అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి మూసీ నదిలో లభించిన మృతదేహం కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం మధ్యాహ్నం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ నదిలో లభించడం మృతదేహం కేసును చేదించినట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన జావేద్ హామీరుల్ హక్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. జావేద్ భార్యపై బీహార్ వ్యక్తి కన్ను వేశాడు అన్న కోపంతో అతడిని మందు తాగించి వైరుతో ఉరివేసి చంపినట్లు అనంతరం మృతదేహాన్ని మూసీ నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించి వారిద్దరిని రిమాండ్ కు తరలించామని ఆయన అన్నారు.