జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా పుష్కలంగా ఉందని ఎక్కడా కూడా యూరియా సమస్య తలెత్తకూడదని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు .గురువారం సచివాలయంలోని సిహెచ్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ ఆనంద్ గ్రౌండ్ వాటర్, పిఎం కుసుమ కు సంబంధించి భూ సమస్యలు పెన్షన్లు తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .నంద్యాల కలెక్టరేట్ నుండి కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు