పల్నాడు జిల్లా,నూజెండ్ల మండలం టి.అన్నారంలో గుడిలో నిర్వహించే కొలుపుల కార్యక్రమం కోసం చందాల వసూలు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది.ఈ ఘటనపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ వివరాలను వెల్లడించారు.గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రభాకర్ హెచ్చరించారు. వైద్య నివేదిక ఆధారంగా దర్యాప్తు చేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు.