భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు చాకలి ఐలమ్మ 40 వర్ధంతిని అధికారికంగా నిర్వహించినట్లు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అరాచకాలు, అణిచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఆమె వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు కలెక్టర్ రాహుల్ శర్మ.