ఎస్ఆర్ పురం మండలం పిళ్లారి కుప్పంలో ట్రాక్టర్తో దాడి చేసి ఒకరి ఇంటి గేటును ధ్వంసం చేసిన జగన్నాథం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఎస్సై సుమన్ కథనం మేరకు.. పాతకక్షల నేపథ్యంలో మునస్వామి అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరచడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.