కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లి సమీపంలో వినాయక నిమజ్జన యాత్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ వెనుకనుంచి లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్లో ముందు వైపు కూర్చున్న సురేష్ కిందపడిపోయి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.