కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ రాజు సోమవారం తెలిపారు . కార్వేటినగరంలో ఆయన మాట్లాడుతూ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణి మానుకోవాలి హితవు పలికారు. ఇలానే కొనసాగితే 2029లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.