కడప జిల్లా జమ్మలమడుగులో అనేక వ్యాపారస్తులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ క్యారీ కవర్స్. పార్సల్ కవర్లను వాడుతున్నారని, సంబంధిత అధికారులు. వెంటనే ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని శుక్రవారం సిఐటియు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎన్జిఓ కార్యాలయం ఆవరణలో జమ్మలమడుగు సిఐటియు కార్యదర్శి దాసరి విజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, పార్సిల్ కవర్లు, అనేక రూపాల్లో ఉన్న ప్లాస్టిక్ను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అనేక రూపాల్లో ఉన్న ప్లాస్టిక్ కారణంగా సైడ్ కాలువలు, మెయిన్ కాలువలలో విపరీతంగా పేరుకు పోయిందన్నారు.