కన్నాయిగూడెం మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇందులో భాగంగా భూపతిపూర్ గ్రామానికి వెళ్లే మార్గం మధ్య చెరువు ఉప్పొంగింది. చెరువు మత్తడి పడడంతో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు తెగిపోయింది. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అధికారులు స్పందించి రాకపోకలు పునరుద్ధరణ చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.