మండపేట స్థానిక మండపేట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అసోసియేషన్ హాలులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షుడు లేగా సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు పాల్గొన్నారు. కార్మికులంతా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.