నవ యుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని, జాషువా సమాజంలోని సామాజిక రుగ్మతలను తన కలంతో ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గుర్రం జాషువా జయంతోత్సవాల బ్రోచర్ను శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రి 7:30కు ఆవిష్కరించారు. 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జాషువా జయంతోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. 7న భీమవరంలో ప్రారంభమవుతాయన్నారు.