మంత్రి లోకేశ్ కృషితో తెలుగు ప్రజలు స్వస్థలాలకు చేరుకున్నారని ఎంపీ శబరి గురువారం అన్నారు. నేపాల్లో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ తెలుగు వారు ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం స్పందించిందన్నారు. వారి బాధ్యతను మంత్రి లోకేశ్కు అప్పగించిందని తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ వార్ రూమ్ను కమాండ్ కంట్రోల్ రూమ్ గా మార్చి సహాయక చర్యలను వేగవంతం చేశారన్నారు.