Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: గురుపూజోత్సవంలో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్

Puthalapattu, Chittoor | Sep 8, 2025
బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూతలపట్టు ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ “తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువులు జ్ఞానం ఇచ్చి జీవితం సార్థకం చేస్తారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక తరం భవిష్యత్తును తీర్చిదిద్దగలడు” అని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us