శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం సుభద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఒక కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి రోడ్డు పక్కన ఉన్న వాగులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.