మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కే దక్కుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన 'సూపర్ సిక్స్, స్త్రీ శక్తి' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి గా చంద్రబాబు కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.