మిలాద్ ఉన్ నబి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఏక్వినార్ మక్కా మసీదులో శుక్రవారం మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీపీ రాజమహేంద్రనాయక్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం డిసిపి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని, రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణాలను కాపాడిన వాళ్ళమవుతామని, రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.