తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని కాపులూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సంగీతం సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. కాపులూరు సర్పంచిగా ఎన్నికైన బూదూరు భూదేవమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీనితో డిపిఓ, ఎంపీడీవో కే సురేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో మల్లు గోపాల్ ఆదేశాల మేరకు వార్డు సభ్యుల సహకారంతో కార్యదర్శి గోపాలయ్య, ఉప సర్పంచ్ గా ఉన్న సంగీతం సుబ్రహ్మణ్యం ను సర్పంచ్ గా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు,అధికారులు సర్పంచ్ గా ఎన్నికైన సంగీతం సుబ్రహ్మణ్యం కు శనివారం శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల