శ్రీకాళహస్తి: ఇళ్ల మధ్య బార్ వద్దంటూ మహిళల ఆందోళన శ్రీకాళహస్తిలోని పానగల్ వద్ద నూతన బార్ ఏర్పాటు చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. చుట్టూ దాదాపు 100 ఇల్లు ఉన్నాయని, నివాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మహిళలు, బాలికలు కళాశాలలకు, పాఠశాలలకు వెళుతూ ఉంటారని, అటువంటి ప్రదేశంలో బార్ ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బందులకు గురి అవుతామని తెలిపారు. అధికారులు వీటికి అనుమతులు ఇవ్వడంపై పునరాలోచించాలని కోరారు.