రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు సదరు విజయోత్సవ సభలో పాల్గొనే అవకాశమున్నందున వాహనాల రాకపోకలు కొనసాగేందుకు పోలీసు వారు సూచించిన ఆంక్షలు తప్పకుండా పాటించి సహకరించాలని జిల్లా ఎస్పీ జగదీష్ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఓ ప్రకటనలో మీడియాకు తెలిపారు. హైదరాబాద్ - బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట – బుక్కరాయసముద్రం – నాయనపల్లి క్రాస్ – నార్పల క్రాస్ – బత్తలపల్లి – ధర్మవరం – ఎన్‌ఎస్ గేట్ – NH-44 మార్గంలో ప్రయాణించాలి. కర్నూల్ - తిరుపతి/చెన్నై వెళ్లే వాహనాలు అనంతపురం టౌన్ నుండి కాకుండా వడియంపేట మీద వెళ్లాలన్నారు.