ఇటీవల ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద నీరు కొమురం భీం అడ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఆదివారం ఉదయం ఒక గేటును 0.30మీటర్ల మేర ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్ట్ పుట్టి స్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులోకి 237.00మీటర్ల చేరింది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది.