సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కె.వి.కె కార్యాలయంలో సోయాబీన్ సాగు పై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. కెవికె శాస్త్రవేత్త స్నేహలత మాట్లాడుతూ సోయాబీన్ పంటలో వచ్చే రోగాలను నివారణ చర్యలను వివరించారు. సాగు పద్ధతులను పాటించినప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు. మట్టి విభాగం నిపుణులు స్వామి మాట్లాడుతూ పంటలో వేసుకోవాల్సిన ఎరువు పద్ధతులను తెలిపారు.